కోనసీమ: నవంబర్ 4వ తేదీన అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో వికాస జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల ద్వారా ఐటీ రంగంలో విశేషంగా రాణించాలని అన్నారు. వికాస ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.