KRNL: ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా ప్రతీ అధికారి, నాయకులు కృషి చేయాలని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి స్పష్టం చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను తీర్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కారం చూపారు.