HYD: గ్రూప్-2 ఫలితాల్లో అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిగా ఎంపికైన 16 మందిని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ సచివాలయంలో సత్కరించి నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నూతన ఉద్యోగ ప్రయాణంలో బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని, విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకంగా పనిచేయాలన్నారు.