RR: శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ORR అండర్ పాస్లు వరద నీటిలో మునుగుతున్నాయని విద్యార్థినులు హైడ్రా కమిషనర్ రంగానాథ్కు ఫిర్యాదు చేశారు. బస్సులో తాము స్కూల్కు వెళ్తామని.. ఇటీవల తాము ప్రయాణిస్తున్న బస్సు అండర్ పాస్ కింద నీటిలో ఆగిపోవడంతో ఇబ్బంది పడ్డామని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు.