NGKL: ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామం నుంచి స్టేజి వరకు వెళ్లే రోడ్డు కల్వర్టు దగ్గర మొంథా తుఫాన్ ప్రభావానికి దెబ్బతింది. దీంతో బీటీ రోడ్డు కుంగిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని గ్రామ నాయకులు గుద్దేటి బాలరాజు, నాగరాజు, మల్లయ్య, జంగయ్య, తదితరులు పేర్కొన్నారు.