KDP: మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తెలిపారు. పెద్దముడియం మండలం నెమళ్లదిన్నె గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన అర్హులకు పింఛన్‌ను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదల సేవలో మంచి ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుందని నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పథకాలే ఇందుకు నిదర్శనమన్నారు.