మహిళల వన్డే ప్రపంచకప్లో టీమిండియా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ‘ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిపై మన టీమ్ సాధించిన విజయం అద్భుతం. అమ్మాయిలు గొప్పగా ఛేదించారు. జెమీమా కీలక మ్యాచ్లో అసాధారణ ప్రదర్శన చేసింది. ఇది పట్టుదల, అభిరుచికి నిజమైన నిదర్శనం. వెల్ డన్ టీమిండియా’ అని ‘X’లో పోస్ట్ చేశాడు.