TG: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రులు జానారెడ్డి, మోత్కుపల్లి నరసింహులు ఆయనను పరామర్శించారు. హరీష్ తండ్రి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. అంతకుముందు సత్యనారాయణరావు చిత్రపటం వద్ద పుష్పాభిషేకం చేసి నివాళులర్పించారు.