KDP: ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు మోసాలకు గురి కావద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ నేరాల నివారణ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అపరిచితులకు వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఇవ్వవద్దన్నారు.