WGL: జిల్లా వెంకటరామ జంక్షన్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఇవాళ 150వ జయంతి సందర్భంగా బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. BJP జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. వజ్ర సంకల్పంతో సంస్థానాలను ఏకం చేసి దేశాన్ని ముక్కలు కాకుండా కాపాడిన ఉక్కు మనిషి పటేల్ అని కొనియాడారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశం కోసమే జీవించారని గుర్తుచేశారు.