KRNL: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని కర్నూలు పోలీస్ విభాగం శుక్రవారం నిర్వహించింది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, హోంగార్డులు, ఏఆర్, క్రీడాకారులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఏక్తా రన్ కొండారెడ్డి బురుజు నుంచి రాజ్వహార్ కూడలి వరకు నిర్వహించారు.