VZM: మొంథా తుఫాన్ ప్రభావతంతో ఎస్. కోట నియోజకవర్గంలో సుమారు 718.95 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. ఈ మేరకు ఎల్. కోట మండల కేంద్రం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఐదు మండలాల వ్యవసాయ అధికారులు పంట నష్టంపై శుక్రవారం ఎమ్మెల్యేకు నివేదిక అందజేశారు. కార్యక్రమంలో కొత్తవలస ఎఎంసీ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.