SKLM: ఇచ్ఛాపురంలోని ప్రభుత్వ బాలురు జూనియర్ కళాశాలలో శుక్రవారం జరిగిన యువజనోత్సవాలు అలరించాయి. ప్రిన్సిపాల్ చింతాడ శరత్ బాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. బాల బాలికలు, ఏపీ మోడల్, కేజీబీవీ, తదితర కళాశాలల యువజనోత్సవాల్లో పాల్గొన్నారు. వీరికి చిత్ర లేఖనం, వ్యాస రచన, ప్రసంగం పలు పోటీలను నిర్వహించారు.