JGL: వెల్గటూర్ మండలంలోని శాఖపూర్ గ్రామంలో పశువులకు శుక్రవారం గాలికుంటు నివారణ టీకాలు వేశారు. మొత్తం 72 ఆవులు, ఎడ్లు, 59 గేదెలకు ఉచితంగా టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ పీ. శ్రీప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.సంధ్య, ఎ. నాగరాజు, కె. నారాయణ, రాం కుమార్, చంద్రయ్య, ఎస్. అంజి తదితర సిబ్బంది పాల్గొన్నారు.