E.G: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగం మొంథా తుఫాన్‌పై ముందస్తు ప్రణాళికలోతో నష్ట తీవ్రత తగ్గిందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శుక్రవారం పెద్దాపురం ఆర్డీవో శ్రీ రమణితో కలిసి కృష్ణవరం, ఎస్.తిమ్మాపురం, శృంగరాయనిపాలెం, రాజుపాలెం, ముక్కొల్లు గ్రామాలలో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి వాలు కాలువ ప్రాంతాలను పరిశీలించారు.