సత్యసాయి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని, జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగా దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.