MBNR: గతంలో రెండుసార్లు వాయిదా పడిన జడ్చర్ల పురపాలక సంఘం చికెన్ వ్యర్థాల సేకరణ వేలం ఎట్టకేలకు ముగిసింది. వ్యర్థాల సేకరణను జడ్చర్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అత్యధికంగా రూ. 34,29,000కు దక్కించుకున్నారు. మూడు గంటలపాటు పోటాపోటీగా ఈ వేలం జరిగింది. ఈ కార్యక్రమంలో సి. రాజు, సయ్యద్ తహసీన్, తదితరులు పాల్గొన్నారు.