NLG: చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో “ఏక్తా దివస్” సందర్భంగా “రన్ ఫర్ యూనిటీ” 2కే రన్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఏక్తా, ఐక్యత ప్రాధాన్యతను చాటుతూ వనిపాకల రోడ్లో 2కె రన్‌ను నిర్వహించారు. చిట్యాల ఎస్సై రవికుమార్, ఏఎస్సై వెంకటయ్యలతో కలిసి యువత, పోలీసులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఈ రన్లో పాల్గొన్నారు.