CTR: చిత్తూరు నగర పాలక పరిధిలోని కట్టమంచి–సాంబయ్య కండ్రిగ బైపాస్ రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పనులను వేగవంతం చేయాలని, కరెంట్ పోల్స్‌ను వెంటనే మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీనగర్ కాలనీలో డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్‌కు సూచించారు.