KDP: భారతదేశ ఐక్యత కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వీఆర్వో విశ్వేశ్వరనాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం మై భారత్, స్టెప్ శాఖల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సభా ప్రాంగణంలో దేశ ఐక్యత దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.