PPM: మహిళల ఆరోగ్యంపట్లసీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సఖి సురక్ష కార్యక్రమాన్ని పార్వతీపురంలోని విజయలక్ష్మీ కళ్యాణమండపంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మెప్మా ఆద్వర్యంలో డ్వాక్రా మహిళలకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలను ఉచితంగా చేయడం ప్రశంసనీయమన్నారు.