అన్నమయ్య: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులు అరెస్ట్ కాగా, ఒకరు పరారీలో ఉన్నారని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె తాలూకా పోలీస్ పరిధిలో నిందితులను అరెస్టు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. రూ. 6.30 లక్షల విలువైన 21.8 కిలోల గంజాయి, రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.