ATP: మరుట్ల గ్రామానికి చెందిన లావణ్య ఔదార్యం చాటుకున్నారు. ఈ నెల 4న మగ శిశువుకు జన్మనిచ్చిన ఆమె, తన బిడ్డకు పాలు ఇచ్చిన తర్వాత మిగిలిన పాలను మదర్ మిల్క్ బ్యాంకుకు దానం చేశారు. సుమారు 12 లీటర్ల పాలు దానం చేయడంతో డిప్యూటీ ఆర్ఎంవో హేమలత ఆమెను అభినందించారు. ఈ పాలను తల్లిపాలు లేని పిల్లలకు అందిస్తామని అన్నారు.