CTR: పలమనేరు కాశీ విశ్వేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం పేర్కొంది. శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.