SS: రొద్దం మండలం గొబ్బరంపల్లిలో డ్రైనేజీ కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వర్షపు నీరు రోడ్డుపై నిలబడుతుందని స్థానికులు తెలిపారు. దీనివల్ల దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గొబ్బరంపల్లిలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు.