ATP: గుంతకల్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదుట శుక్రవారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పట్టణ కార్యదర్శి సురేంద్రబాబు మాట్లాడుతూ.. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.