VZM: రాష్ట్రానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే పెద్ద విపత్తు అని చీపురుపల్లి ఎమ్మెలే కిమిడి కళావెంకట రావు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన ప్రెస్ మీట్లో మాటాడుతూ.. 2019లో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీతో అందలమెక్కిస్తే నమ్మిన జనాన్ని నట్టేట ముంచేశాడన్నారు. మొంథా తుఫాన్ చంద్రబాబు సృష్టించినదేనని జగన్ చేసిన వ్యాఖ్యలపై కళా మండిపడ్డారు.