TPT: ఇందిరమ్మ కీర్తి భారతీయులకు స్ఫూర్తి అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్ కొనియాడారు. ఇందులో భాగంగా నగరి నియోజకవర్గ కోఆర్డినేటర్ సికె కార్తికేయన్ ఆధ్వర్యంలో పుత్తూరు పట్టణంలో స్వర్గీయ ఇందిరా గాంధీ 41 వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించారు. పోటుగారి భాస్కర్ మాట్లాడుతూ.. ప్రపంచమే మెచ్చుకున్న మహిళా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అని అన్నారు.