SKLM: ఏలూరు కేవీడీ హైస్కూల్లో నవంబర్ 1 నుంచి 2 వరకు జరగనున్న అండర్-17 రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు బొబ్బిలి క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ బంకురు ప్రసాద్ చెప్పారు. జిల్లా స్థాయిలో ఎం. ప్రవీణ్ కుమార్, బి. మహాలక్ష్మి ఉత్తమ ప్రతిభ కనబరచడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరిని ఎమ్మెల్యే బేబినాయన బొబ్బిలి కోటలో శుక్రవారం అభినందించారు.