TG: HYDలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 76 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు రూ.51 లక్షలు టోకరా వేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఆ బాధితుడిని, బాంబు పేలుళ్లు/కిడ్నాప్ కేసుల్లో సిమ్ వాడారని వాట్సాప్ కాల్ చేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వీడియో కాల్లో 24 గంటలు నిర్బంధించి డబ్బు కాజేశారు. మనీలాండరింగ్‌లో భాగస్వామ్యం ఉందని బెదిరించి మోసం చేశారు.