ASR: తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తున్నామన్నారు. ముఖ్యంగా తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేయిస్తున్నామని తెలిపారు.