సత్యసాయి: హిందూపురం తపాలా సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ప్రజలకు మెరుగైన సేవలు అందించి వ్యాపార లక్ష్యాలను సాధించినందుకు ఉత్తమ తపాలా సూపరింటెండెంట్ అవార్డును అందుకున్నారు. తపాలా ఇన్సూరెన్స్, బాల ఆధార్, ఆధార్-మొబైల్ అనుసంధానం సేవల్లో విశిష్ట పనితీరును ప్రదర్శించినందుకు తపాలాశాఖ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి ఆయనకు ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.