SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల మండల తహసీల్దార్ సరిత అన్నారు. మునగాల మండలం ముకుందాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను శుక్రవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులు ప్రభుత్వ నిబంధన ప్రకారం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.