SKLM: మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిర్ణయం పేద, మధ్య తరగతి విద్యార్థులకు గొడ్డలిపెట్టు నిర్ణయం అని శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శుక్రవారం పొందూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన అనంతరం కోటి సంతకాలు కార్యక్రమం నిర్వహించారు. పీపీపీ విధానం పేరుతో వైద్య, విద్యకార్పొరేట్ సంస్థలకు చంద్రబాబు అమ్ముకుంటున్నారని ధర్మాన తెలిపారు.