భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO ప్రతిష్టాత్మకమైన LVM3-M5 రాకెట్ ప్రయోగానికి ఇవాళ కౌంట్‌డౌన్ ప్రారంభించనుంది. రాకెట్‌ను రేపు సాయంత్రం 5:26 గంటలకు అంతరిక్షంలోకి పంపనున్నారు. ఈ ప్రయోగం ద్వారా 4,410 కిలోల బరువు ఉన్న CMS-03 ఉపగ్రహాన్ని (కమ్యూనికేషన్ శాటిలైట్) భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రోకు మరో ఘనత దక్కనుంది.