MBNR: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారం చేపట్టిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ప్రజల మన్ననలు పొందిందని ఎమ్మెల్యే తెలిపారు.