NLG: మనుగోడు మండలంలోని సింగారం ఐకేపీ కేంద్రం నుంచి ధాన్యం తరలిస్తున్న లారీ శనివారం మట్టి రోడ్డుపై కూరుకుపోయింది. రైతులు రెండు జేసీబీల సహాయంతో లారీని బయటికి తీశారు. దాదాపు మూడు గంటల శ్రమించి లారీని బయటకు తీసినట్లు రైతులు తెలిపారు. లారీ మట్టిలో కూరుకుపోయిన సంబంధిత అధికారులు లారీ దగ్గరకు రాలేదని రైతులు వాపోయారు.