SKLM: టెక్కలి పట్టణానికి చెందిన భవన నిర్మాణ మేస్త్రి జగదీశ్‌పై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానికంగా ఓ బాలికను కొంత కాలం నుంచి వెంటపడి వేధిస్తున్నాడని, గురువారం రాత్రి మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడని బాధితురాలి తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ విజయ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.