NDL: వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా భారీ ఆదాయం సమకూరిందని EO చంద్రశేఖర్ తెలిపారు. రూ.1,06,20,700 నగదుతోపాటు 120.090 గ్రాముల బంగారం, 872.048 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ US డాలర్లు 8, పౌండ్స్ 125, సౌదీ అరేబియా రియాల్ 286, దిర్హమ్స్ 110 ఆదాయంగా లభించిందని ఆయన వెల్లడించారు.