SRCL: బోయిన్ పల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూల్లో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ కార్తీక్ బృందం బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మందులు పంపిణీ చేశారు. డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణించగలమని, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, హ్యాండ్ వాష్ టెక్నిక్, ఎనీమియాపై అవగాహన కల్పించారు.