NGKL: ఊరుకొండ మండలంలోని నర్సంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరుపై గ్రామానికి చెందిన పోలే అర్జునయ్య శుక్రవారం ఎంపీడీవో కృష్ణయ్యకు ఫిర్యాదు చేశారు. గ్రామ కార్య దర్శి పారిశుద్ధ్య పనులు చేయించకుండా, గ్రామ పంచాయతీ కార్మికులను సొంత పనులకు వినియోగిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎంపీడీవోను కోరారు.