ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం కసాపురంలో వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి రాజగోపురాల శిఖర ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్నారు. సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆమె స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అందరిపై స్వామివారి కృప ఉండాలని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.