SS: సోమందేపల్లి మండల కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఏఐటీయూసీ కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కామ్రేడ్ బాలస్వామి, రాజుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.