సత్యసాయి: పుట్టపర్తిలో సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల సందర్భంగా భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చిత్రావతి నది తీరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. నది తీరమంతా పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేశారు. బ్రిడ్జిపై ఆకర్షణీయమైన లైటింగ్స్ ఏర్పాటు చేస్తూ, రాత్రివేళల్లో ప్రత్యేక శోభ వచ్చేలా తీర్చిదిద్దుతున్నారు.