అన్నమయ్య: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో విజేతలైన విద్యార్థులు, పోలీసు పిల్లలు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి శుక్రవారం రాయచోటిలో సన్మానించారు. విజేతలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. విద్యార్థులు కృషితో చదువులో రాణించి, పోటీ పరీక్షల్లో విజయాలు సాధించి సమాజానికి సేవ చేయాలని ఎస్పీ సూచించారు.