PPM: మన్యం జిల్లా పార్వతీపురం ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న అంకిత సురానను సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ( పరిపాలన)గా బదిలీ చేస్తూ రాష్ట్ర డీ.జీ.పీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీచేశారు. పార్వతీపురంలో బాధ్యతలు నిర్వహిస్తూ అదనంగా సత్యసాయి జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తారు. త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపారు.