ATP: బుక్కరాయసముద్రం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని వీరభద్ర కాలనీలో ఓ చిన్నారి నీటి బకెట్లో పడి మృతి చెందింది. ప్రభాకర్, రజిని దంపతులు ఆటోలో తిరుగుతూ కూరగాయలు విక్రయంతో జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంకాలం వారి కూతురు చిన్నారి గీష్మ నీటి ఆడుకుంటూ నీటి బకెట్లో పడి ఊపిరాడక మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.