నెల్లూరు జిల్లాలో హోల్ సేల్, రిటైల్ డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని అగ్రికల్చర్ జేడీ సత్యవాణి హెచ్చరించారు. బ్లాక్లో యూరియా అమ్మకాలపై వార్తలు రావడంతో ఆమె స్పందించారు. అధిక ధరలకు ఎవరైనా విక్రయిస్తే 83310 57285కు కాల్ చేయాలని రైతులకు సూచించారు. ఈ నెలాఖరున మరో 6వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వస్తుందన్నారు.