NRPT: సీఎం సొంత జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. జిల్లాలోని మొత్తం 272 సర్పంచ్ స్థానాలకు గాను, మొదటి విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు 155 చోట్ల ఘనవిజయం సాధించారు. బీఆర్ఎస్ 53, బీజేపీ 21 స్థానాలను కైవసం చేసుకోగా.. స్వతంత్రులు, ఇతరులు 43 చోట్ల గెలుపొందారు.