SKLM: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సీఈవో డీ. సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ అధ్యక్షురాలు పీ.విజయ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖల అధికారులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు.